శ్రీకాళహస్తి వరద బాధితులకు అండగా జనసేన

శ్రీకాళహస్తి నియోజకవర్గం, గడిచిన 10 రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బ తిన్న ప్రాంతాలను పరిశీలించడానికి, ప్రజలను పరామర్శించడానికి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ వారం రోజుల్లో రానున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ పర్యటనకు ముందుగా క్షేత్ర స్థాయిలో జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి, ప్రజలను పరామర్శించడానికి ఈరోజు జనసేన పార్టీ పిఏసి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ శ్రీకాళహస్తి నియోజకవర్గం, రేణిగుంట మండలం, జీవగ్రామ్ కాలనిలో శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోట తో కలిసి జీవగ్రామ్ గ్రామంలో తీవ్రంగా దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించి, అక్కడి ప్రజలను పరామర్శించారు, అనంతరం నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోట అధ్వర్యంలో శ్రీ నాదెండ్ల మనోహర్ బాధిత 100 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు, దుప్పట్లు పంపిణీ చేశారు. ముఖ్యంగా ఆ ప్రాంతంలో కాలువలు ఆక్రమణలకు గురి కావడం వలన ఈ పరిస్థితి కృత్రిమంగా ఏర్పడిందని ప్రజలు తెలియజేశారు. దాదాపు అన్ని కుటుంబాలు కట్టుబట్టలతో ఉన్న పరిస్థితి. ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం 100 కుటుంబాలు ఉండగా కేవలం కొద్ది మందికే ఇచ్చారని అది కూడా జనసేన పార్టీ ఈరోజు ఈ కార్యక్రమం చేస్తుందని హడావిడిగా చేశారని ప్రజలు తెలియజేశారు. అన్ని విధాలా నష్ట పోయిన ప్రజలకు అండగా జనసేన పార్టీ ఉండి, న్యాయం జరిగేలా చేస్తామని మనోహర్ గారు ప్రజలకు ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా శ్రీమతి వినుత జరిగిన పరిస్థితులని వివరించారు జనసేన పార్టీ ప్రతి కుటుంబాన్ని కలిసి పరామర్శించిన తర్వాత స్థానిక శాసన సభ్యులు మొక్కుబడిగా ఆ ప్రాంతంలో పర్యటించారని, ఈరోజు జనసేన పార్టీ నుండి నాదెండ్ల మనోహర్ గారి పర్యటన ,నిత్యావసర వస్తువులు వితరణ కార్యక్రమాన్ని మధ్యాహ్నం చేయనున్నట్టు తెలిసి, హడావిడిగా బియ్యం పంపిణీ చేశారని తెలియజేశారు. స్థానిక ఎమారో వెంటనే అక్రమ కట్టడం తొలగించి కాలువను బాగు చెయ్యాలని డిమాండ్ చేశారు. లేని యెడల గ్రామస్థులతో కలిసి జనసేన పోరాడుతుందని తెలియజేశారు. మొక్కుబడిగా కొన్ని గ్రామాల్లో ఆర్థిక సహాయం కాకుండా దెబ్బ తిన్న ప్రతి గ్రామం లో ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి పేద కుటుంబానికి 2000/- ఆర్థిక సహాయాన్ని అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం తిరుపతిలోని వరద బాధిత ప్రాంతాల్లో పర్యటనకు వెళ్లారు.