శ్రీకాళహస్తి జనసేన ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా అరెస్టు

శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటాని అక్రమంగా అరెస్టు చేసి శ్రీకాళహస్తి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. వారి ఇంటికి వచ్చిన నాయకులు, కార్యకర్తలను ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకుని ఇంఛార్జి వినుత కోటాని భర్త కోటా చంద్రబాబుని, నాయకులు, జనసైనికులను అక్రమంగా అరెస్టు చేసి స్టేషన్ కి తరలించడం జరిగింది. పోలీసుల వైఖరిని నిరసిస్తూ పోలీస్ స్టేషన్లో కూర్చుని జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి వినుత కోటా మరియు నాయకులు నల్ల రిబ్బన్ కట్టుకుని నిరసన తెలియజేయడం జరిగింది.