పారిశుద్ధ్య కార్మికులకు మద్దతు తెలిపిన శ్రీకాంత్ రెడ్డి

పారిశుద్ధ్య కార్మికులు మరియు మున్సిపల్ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఉద్యోగులు మరియు కార్మికులు చేస్తున్న నిరసనలో భాగంగా కార్మికుల ఆహ్వానం మేరకు తాడిపత్రి నియోజకవర్గ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఏవైతే కార్మికులకు ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటిని వెంటనే నెరవేర్చాలని లేని పక్షంలో కార్మికులతో కలిసి దీక్ష చేస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా తమకు మద్దతుగా నిలిచిన శ్రీకాంత్ రెడ్డి కి కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు కిరణ్, అయూబ్, రసూల్, నాగార్జున, రాహుల్, మణికంఠ, షెక్షా, రాజశేఖర్, ఆదిత్య పాల్గొన్నారు.