శృంగవరపుకోట జనసేన ఆధ్వర్యంలో మహాత్మాగాంధీకి ఘన నివాళి

శృంగవరపుకోట నియోజకవర్గంలో మహాత్మగాంధీ 153 వ జయంతి సందర్బంగా ఆర్టీసీ కాంప్లెక్స్ లో మహాత్మాగాంధీ విగ్రహానికి జనసేన పార్టీ నాయకులు శృంగవరపుకోట నియోజకవర్గ నాయకులు వబ్బిన సత్యనారాయణ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళలు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శృంగవరపుకోట నియోజకవర్గ నాయకులు రామల్లె శివాజీ, వాబ్బిన సన్యాసినాయుడు, మండల నాయకులు కోట్యాడ రామకోటి, మోపాడ చిన్ని, కోలా మధు, రుద్ర నాయుడు తాండ్రంగి చంటి, జనసైనికులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వబ్బిన సత్యనారాయణ మాట్లాడుతూ గాంధీ ఆశయాలకు, సిద్ధాంతాలుకు జనసేన పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు.