శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి హీరోలుగా ‘హౌస్‌ అరెస్ట్‌’

హాస్యనటులు సప్తగిరి, శ్రీనివాస్‌ రెడ్డి హీరోలుగా ‘హౌస్‌ అరెస్ట్‌’ అనే సినిమా ప్రారంభమైంది. ’90 ఎంఎల్‌’ ఫేమ్‌ శేఖర్‌ రెడ్డి యెర్ర దర్శకత్వంలో కె. నిరంజన్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో మొదలుపెట్టారు. శ్రీనివాస్‌ రెడ్డి, సప్తగిరిలపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి డైరెక్టర్‌ బాబీ క్లాప్‌ ఇచ్చారు. రెగ్యులర్ షూటింగ్ సైతం ప్రారంభమైంది..

ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి అస్రిన్ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తుండగా, జె. యువరాజ్ సినిమాటోగ్రాఫర్‌గా, చోటా కె. ప్రసాద్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నారు.