గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్న శ్రీనివాస్ యాదవ్

తన పుట్టిన రోజు సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు తన పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ రోజు తన నివాసంలో మంత్రి తలసాని మొక్కలు నాటారు. సీఎం కేసీఆర్ ఆకాంక్ష మేరకు ఆకుపచ్చ తెలంగాణ కావాలన్న ఆలోచనతో హరితహారం కార్యక్రమానికి స్పూర్తిగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా ముందుకెళ్తుందని మంత్రి పేర్కొన్నారు.