చత్రపతి శివాజీ జయంతి శోభాయాత్రలో పాల్గొన్న యల్లటూరు శ్రీనివాస రాజు

ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం, నందలూరులో బుధవారం చత్రపతి శివాజీ జయంతి సందర్భంగా విశ్వహిందూ పరిషత్ ఆద్వర్యంలో ఘనంగా శోభాయాత్ర జరిగింది. ఈ యాత్రలో జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజు మరియు బిజెపి నాయకులు సాయి లోకేష్, నాగోతు రమేష్, పోతుగుంట రమేష్ లు ముఖ్య అతిధులుగా పాల్గొని యాత్ర తరువాత శివాజీ విగ్రహానికి పూలమాలలువేసి ఆయన చరిత్రను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాజీ జడ్పిటిసి యల్లటూరు శివరామరాజు, మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, పోతురాజు మస్తానయ్య, విశ్వనాథ్, హిమగిరినాథ్ యాదవ్, తాటి సుబ్బరాయుడు, కృష్ణ యాదవ్, నరేంద్ర, టిడిపి మహిళా నాయకురాలు వాణి, ఆకుల చలపతి, గురివిగారి వాసు, తిప్పాయపల్లె ప్రశాంత్, మోడపోతుల రాము, ఏనుగుల బాలాంజనేయులు, సమ్మెట ఉమామహేష్, తోట శివశంకర్, గుణయాదవ్, సురేష్, సాయిరాజు, మురళి, సుబ్బరాయుడు నందలూరు మండల కూటమి నేతలు, మండల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Share this content:

Post Comment