రాజంపేట జనసేనలో జోరు పెంచిన యల్లటూరు శ్రీనివాస రాజు

రాజంపేట నియోజకవర్గం: నందలూరు మండలంలోని కోనాపురం గ్రామంలో దాదాపు 50 దళిత కుటుంబాలు రాజంపేట నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు యల్లటూరు శ్రీనివాస రాజు నేతృత్వంలో జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. స్థానిక ప్రజలు వాళ్ళు పడుతున్న ఇబ్బందులు గురించి మాట్లాడుతూ నేటికి మాకు నీటి సౌకర్యం, కరెంట్ సదుపాయం, రోడ్ల సదుపాయం ఇప్పటికీ ఏ నాయకులు మా సమస్యలని పరిష్కరించలేక పోయారని జనసేన నాయకులు యల్లటూరు శ్రీనివాసరాజుకి విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు యల్లటూరు శ్రీనివాస రాజు గారు మాట్లాడుతూ అణగారిన వర్గాల వారికి జనసేన పార్టీ ఎల్లవేళలా తోడుగా ఉంటుందని ప్రజా సమస్యలను పట్టించుకోని అధికార పార్టీ నాయకులకు రానున్న ఎన్నికల్లో జనసేన టిడిపి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రజా సమస్యలని ఎలా పరిష్కరిస్తామో చేసి చూపుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామస్థులు ఎలక చర్ల హరిబాబు, రమేష్, సునీల్, పోటూరి నరేష్, నరసింహులు, నరసయ్య, రాజ్ కుమార్, నవీన్, ఠాగూర్, సుబ్రహ్మణ్యం, చిన్నబ్బి, చంటయ్య, చిన్న సుబ్బయ్య, లలితమ్మ, మహేష్, పెంచలయ్య వీరమహిళలు జయమ్మ, ఆదెమ్మ, చంటమ్మ, పద్మ, చిన్నక్క, లక్ష్మీ, రమాదేవి, నందలూరు మండల నాయకులు మాజీ జెడ్పీటీసీ యల్లటూరు శివరామరాజు, ఆకుల చలపతి, గురువిగారి వాసు, భారతాల ప్రశాంత్, యల్లటూరు సుబ్రహ్మణ్యం, రాజంపేట జనసేన నాయకులు పివిఆర్ కుమార్, కడవకూటి సుధాకర్ మరియు జనసైనికులు, తదితరులు పాల్గొన్నారు.