సి.రామచంద్రయ్యను కలిసిన యల్లటూరు శ్రీనివాస రాజు

రాజంపేట: ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ జనసేన నేత యల్లటూరు శ్రీనివాసరాజు ఎమ్.ఎల్.సి సి.రామచంద్రయ్యను గురువారం కడపలోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి పూల బొకే శాలవాతో సన్మానించి వచ్చే ఎన్నికల్లో రాజంపేట నుండి తనకు అవకాశం వస్తే మీ ఆశీస్సులు, సహాయ సహకారాలు మాకు అవసరమని ఆయన కోరారు. సి.రామచంద్రయ్య కూడా సానుకూలంగా స్పందించారన్నారు. ఆయనతోపాటు నందలూరు మండల మాజీ జడ్పీటీసీ సభ్యులు యల్లటూరు శివరామరాజు, నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.