తెరుచుకున్న శ్రీవారి వైకుంఠ ద్వారాలు

వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నారు. ఈ యేడాది 10రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనాన్ని టీటీడీ కల్పిస్తోంది. ఏకాంతంగా కైంకర్యాలు, అభిషేకాది కార్యక్రమాని నిర్వహించిన అనంతరం 4గంటలకు ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులను దర్శనానికి అనుమతించారు. ఉదయం 8గంటల నుంచి ప్రత్యేక, సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్ కలిగిన భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు. నేటి ఉదయం 9గంటలకు స్వర్ణరథంపై శ్రీదేవి,భూదేవి సమేత మలయప్పస్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. కోవిడ్ ఆంక్షలు నేపథ్యంలో దర్శన టోకెన్లు ఉన్న భక్తులను మాత్రమే తిరుమలకు టీటీడీ అనుమతించనుంది.