జనసేన తరఫున పేదలకు అండగా నిలబడతా.. గునుకుల కిషోర్

  • మున్సిపల్ కాలవ కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో నేలకొరిగిన ఇల్లు, వీధినపడ్డ బ్రతుకులు నెలలు గడిచినా నష్టపరిహారం ఇవ్వక చోద్యం చూస్తున్న వైసిపి ప్రభుత్వం

నెల్లూరు: బుచ్చిరెడ్డిపాలెం 4 వార్డు ఖాదర్ నగర్ నందు 2022 డిసెంబర్ 23 న గత 25 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న షేక్ ఖాదర్ మస్తాన్ ఇంటి ముందు డ్రైనేజీ కాలువల తవ్వకాలలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ఒక అడుగు ముందుకు తవ్వడం వల్ల ఇంటి గోడ కూలి రేకులు పగిలి ఇల్లు నేలకొరిగింది. రోజువారి కూలీ చేసుకునే మాకు మల్లీ తిరిగి కట్టుకునే స్థోమత లేదు. అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిన ఈ ప్రమాదానికి నష్టపరిహారం ఇప్పించాలంటూ మున్సిపల్ చైర్ పర్సన్, ఎమ్మార్వో ను ఎన్నిసార్లు అడిగినా కూడా లాభం లేకుండా పోయింది. కనీసం నోటీసులు ఇవ్వకుండా ఇటువంటి చర్యలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని తమకు వెంటనే నష్టపరిహారం చెల్లించాలంటే బాధితులు డిమాండ్ చేస్తున్నారు. స్థానిక జనసేన కార్యకర్తల అభ్యర్థుల మేరకు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గునుకుల కిషోర్ అక్కడికి చేరుకుని లీగల్ టీం ద్వారా పరిశీలించి బాధితులకు అండగా నిలబడతామని, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని రోజువారి కూలీలు చేసుకునే ఈ పేదలకు అండగా నిలబడాలి. లేకుంటే జనసేన పార్టీ తరఫున బాధితులకు నష్టపరిహారం అందే వరకు కూడా వారికి అండగా నిలబడతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్త ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ తో పాటు కాశిఫ్, షామీర్, వెంకట సాయి, ఋషిబాలాజీ, కంథర్, అమీన్, ప్రశాంత్ గౌడ్, షాజహన్ తదితరులు పాల్గొన్నారు.