ఆలపాటికి అండగా నిలబడి అత్యధిక మెజారిటీతో గెలిపించండి: గాదె, బోనబోయిన

ఈ నెల 27న జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ణ్డా కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, మరియు ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరావు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పరిధిలో ఉన్న నగరంపాలెంలోని స్టాల్ గర్ల్స్ హైస్కూల్ మరియు సంపత్ నగర్ లో గల వైష్ణవి స్కూళ్లలో ఉన్న ఉపాధ్యాయులను కలిసి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ఉపాధ్యాయులు అందరితో కలిసి రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని గెలిపించాలని వారిని అభ్యర్ధించడం జరిగింది. ఎన్.డి.ఏ కూటమి అభ్యర్థిగా ఉన్న ఆలపాటిని గెలిపించుకోవడం వలన టీచర్లకు వారి-వారి సమస్యల పరిష్కరానికి ఒక్క చక్కటి అవకాశం దొరుకుతుందని హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితంగా ఉండే ఆలపాటి రాజేంద్రప్రసాద్ ని గెలిపించుకోవడం వలన గ్రాడ్యుయేట్స్ అందులోను ముఖ్యంగా నిరుద్యోగులు మీ బంగారు భవిష్యత్తు కోసం మంచి దారి ఏర్పాటు చేసుకున్న వారు అవుతారని అన్నారు. అలాగే రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంతో రాజకీయ అనుభవం ఉన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి తమ ప్రధమ ప్రాధాన్యత ఓటును 1 మీద వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని మీ తరపున ప్రతినిధిగా మీ సమస్యలు పరిష్కరించుకునే వ్యక్తిగా ఎన్నుకోవాలని మీడియా ముఖంగా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మద్దిరాల మ్యాని, జనసేన పార్టీ గుంటూరు జిల్లా కమిటీ సభ్యులు చిట్టాల త్రినాధ్, కార్పొరేటర్ ఎర్రంశెట్టి పద్మావతి, నగర కమిటీ సభ్యులు కటకంశెట్టి విజయలక్ష్మి, వార్డు అధ్యక్షులు బాలకృష్ణ, తాడికొండ కిషోర్, దలవాయి కిషోర్, సంజీవ్, జెట్టిబాబు, కృష్ణ, కోటేశ్వరరావు జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Share this content:

Post Comment