40వ డివిజన్ తరపున బలంగా నిలబడతా.. ఎం హనుమాన్

జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో శనివారం జరిగిన జడ్పిటిసి, ఎంపీటీసీ మరియు డివిజన్ అధ్యక్షుల సమావేశంలో 40వ డివిజన్ కో ఆర్డినేటర్ తరుపున జనసేన రాష్ట్ర నాయకులు ఎం.హనుమన్ కు అవకాశం ఇచ్చిన సందర్భంగా హనుమన్ మాట్లాడుతూ 40 డివిజన్ కోఆర్డినేటర్ తరుపున నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మరియు పశ్చిమ నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ పోతిన వెంకట మహేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. 40వ డివిజన్లో జరిగే సమస్యల గురించి బలంగా పోరాడుతామని, రాబోయే ఎన్నికల్లో 40వ డివిజన్ తరపున బలంగా నిలబడతామని, ఎన్ని అవాంతరాలు ఎదురొచ్చినా సరే జనసేనతో ఉంటూ పోతిన మహేష్ బాబు గారు వైపు మా ప్రయాణమని తెలియజేసారు.