గుంటూరు, ఈనెల 27వ తేదీన జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రత్తిపాడు నియోజవర్గం, వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామంలోని పలు స్కూళ్లలో మరియు గ్రామ సచివాలయాలలో నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు అందరూ కలిసి ఈ నెల 27న జరగబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేయుచున్నారని, వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఎంతో అనుభవజ్ఞులని, బ్యాలెట్ పేపర్ లో మొదటి సీరియల్ నెంబర్ ఆలపాటి రాజాదని, ఆ పేరుకి ఎదురుగా “1” అనే అంకె వేసి ఆలపాటి రాజాకి మద్దతుగా నిలబడవలసిందిగా కోరారు. అలాగే పాఠశాలలో ఉన్న టీచర్లు అందరూ ఎంతో విజ్ఞులని, సమాజానికి ఏం కావాలో పూర్తిగా అవగాహన ఉన్న వ్యక్తులని, సమాజానికి మంచి పౌరులను అందించే బాధ్యత టీచర్స్ పై ఉంది తెలియచేసారు. ఈ కార్యక్రమంలో వీరిశెట్టి జగన్, బీరాల శ్రీను, తుమ్మల రత్తయ్య, రామయ్య, వెంకట్, రాంబాబు, పాపయ్య, నారాయణ, రాంబాబు, సాంబశివరావు, గురవయ్య మరియు ముట్లూరు కూటమి నాయకులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment