రాజంపేట, కూటమి ప్రభుత్వంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పేర్కొన్నారు. మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో గురువారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలనేది పవన్ కళ్యాణ్ లక్ష్యమన్నారు.ఆయన ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి ప్రజల కష్టాలను తెలుసుకొని మారుమూర ప్రాంతాలకు కూడా రోడ్లు వేయించి ప్రజల ఆశీస్సులను పొందారన్నారు. జనసేన పార్టీ సభ్యత నమోదు కార్యక్రమం చేపట్టి ప్రమాదవశాత్తు మరణించిన వారికి ప్రమాద భీమా సౌకర్యం కల్పించి వారిని ఆదుకోవడం జరుగుతుందన్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంతగానో కష్టపడుతున్నారన్నారు. చేనేతలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించడం హర్షణీయమన్నారు.రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని రామయ్య తెలిపారు.
Share this content:
Post Comment