పవన్ కళ్యాణ్ లాంటీ నిజాయితీ పరులు రాష్ట్రానికి అవసరం: సయ్యద్ నాగుర్ వలి

పల్నాడు జిల్లా, నకరికల్లు మండలం జనసేన వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ నాగుర్ వలి మాట్లాడుతూ.. జనసేన అధినేత పవన్ కళ్యాన్ ఇస్లాం విద్యా, ధార్మిక సంస్థలు, ప్రార్థన స్థలాలకు 25 లక్షల రూపాయలు విరాళంగా అందించడం ఆనందదాయకమని హర్షం వ్యక్తం చేశారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా విజయవాడ మంగళగిరి అమరావతి చెందిన పలువురు ముస్లిం పెద్దలు ఉపవాస దీక్ష అనంతరం హైదరాబాదులో జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ కలిశారని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఇస్లాం విద్యా, ధార్మిక సంస్థలు ప్రార్థన స్థలాలకు 25 లక్షల విరాళంగా అందించి, ముస్లిం నివాస ప్రాంతాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పనకు జనసేన పార్టీ ప్రాధాన్యత ఇస్తుందని చేపడడం ముస్లిం సమాజంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి ఉన్న చిత్తశుద్ధి నిదర్శనం అని, ముస్లిం సమాజం అభివృద్ధి చెందాలంటే పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీపరులు మన రాష్ట్రానికి అవసరమని, రాబోయే రోజుల్లో ముస్లింలందరూ జనసేన పార్టీకి అండగా నిలబడి అధికారంలో రావడానికి కృషి చేస్తామని, అల్లాహ్ శుభ ఆశీస్సులు పవన్ కళ్యాణ్ పై ఉండాలని సయ్యద్ నాగుర్ వలి అన్నారు. ఈ కార్యక్రమంలో నకరికల్లు మండలం జాయింట్ సెక్రెటరీ ఎస్.కే కాలేషా, డి సైద్ మస్తా, సి హెచ్ బాజీ, ఎస్.కే మస్తాన్ వలి, డి సైదులు ముస్లిం మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.