• వైసీపీ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం
• వ్యవస్థలను జేబు సంస్థలుగా మార్చేశారు
• రాజకీయాలను క్రిమిలైజేషన్ చేసేశారు
• వైసీపీని తరిమికొట్టి రాజకీయాలను ప్రక్షాళన చేయాలి
• పండగ వాతావరణంలో ఆవిర్భావ సభ జరగబోతోంది
• ఊరువాడా తరలివచ్చి విజయవంతం చేద్దాం
• పాయకరావుపేటలో జరిగిన ఆవిర్భావసభ సన్నాహక సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్
‘విశాఖ విమానాశ్రయంలో కోడి కత్తి డ్రామాతో అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ… అధికారంలోకి వచ్చాక గొడ్డలిని వాడింద’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి వ్యవస్థలను జేబు సంస్థలుగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించాలన్నా చాలా ఇబ్బందిపడాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారని తెలిపారు. ప్రజల ముందుకు రావడానికి భయపడి పరదాల చాటున వెళ్లిన ముఖ్యమంత్రిని మనం గతంలో ఏనాడైనా చూశామా అని ప్రశ్నించారు. సోమవారం సాయంత్రం పాయకరావుపేటలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ సన్నాహక సమావేశంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “వైసీపీ నాయకులు రాజకీయాలను క్రిమిలైజేషన్ చేశారు. గత ప్రభుత్వంలో దాదాపు 300 మందిని జీతాలకు పెట్టుకొని సోషల్ మీడియా ద్వారా ప్రతిపక్షాలపై దుష్ప్రచారం చేయించారు. పార్టీ తరఫున చిన్న చిన్న కార్యక్రమాలు చేసినా అక్రమ కేసులు బనాయించారు. పాయకరావుపేటలో మన అధినాయకుడి పుట్టిన రోజు వేడుకలు జరిపినందుకు కేసులు పెట్టారు. రోడ్ల దుస్థితిపై గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే కార్యక్రమం చేస్తే వేధించారు. వీళ్లకు నిజంగా దమ్ముంటే ప్రజా సమస్యలు, రాజకీయ అంశాలు, అభివృద్ధి, సంక్షేమంపై చర్చకు రమ్మనండి… చచ్చినా రారు. ఎవరిని ఎక్కడ లేపేస్తే ఓట్లు పడతాయి.. అనే రాజకీయం తప్ప వీళ్లకు వేరేది తెలియదు.
• విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఏనాడైనా మాట్లాడారా..?
విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు నినాదంతో ఏర్పాటైన స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేస్తున్నామని కేంద్రం ప్రకటించగానే ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలకు పరిస్థితిని వివరించి వినతిపత్రం ఇచ్చింది శ్రీ పవన్ కళ్యాణ్ గారు. 30 మంది ఆత్మ బలిదానాలతో ఏర్పడిన పరిశ్రమను ప్రైవేటీకరణ చేయొద్దు అని ఒప్పించింది శ్రీ పవన్ కళ్యాణ్ గారు. గత ముఖ్యమంత్రి ఏనాడైనా ప్రైవేటీకరణపై మీడియా సమావేశం పెట్టి మాట్లాడారా..? అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లండి మేము వస్తాం అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెబితే మాట తప్పం మడమ తిప్పమని చెప్పుకునే ఈ పెద్ద మనిషి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే చాలా మంది మమ్మల్ని ప్రశ్నించారు. వాళ్లందరికీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు. దేశ భవిష్యత్తు, రాష్ట్ర అభివృద్ధి, జాతి మనుగడకు పొత్తు అవసరమని చెప్పారు. ఈనాడు కూటమిలో భాగస్వాములుగా ఉన్నాం కనుకే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోగలిగాం. పొత్తు పెట్టుకున్నాం కనుకే ఎలమంచిలి నియోజకవర్గంలో రూ.లక్ష కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. వేలాదిమంది యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.
• ఎన్నో ఇబ్బందులు సృష్టించారు
ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నాం కనుక ఆవిర్భావ సభకు పదిరోజుల ముందు నుంచి ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా నిస్వార్థంగా పని చేసే జన సైనికులు, వీర మహిళలను సభకు సురక్షితంగా తీసుకొచ్చి… అంతే సురక్షితంగా ఇంటికి పంపించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదు. మూడు రోజుల ముందు వరకు సభకు పర్మిషన్ ఇచ్చేవారు కాదు. సభకు స్థలం ఇచ్చే రైతులను అధికారం అడ్డుపెట్టుకొని బెదిరించేవారు. వారి బెదిరింపులకు లొంగకుండా ఇప్పటం గ్రామంలో సభకు స్థలం ఇచ్చారనే అక్కసుతో రైతుల ఇళ్లను కూల్చేశారు. ఇప్పటం అనే చిన్న గ్రామానికి 120 అడుగుల రోడ్డు అవసరమా..? ఇంతలా కక్ష సాధించేవారు. ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం. పార్టీ ఆవిర్భావ సభను పండగ వాతావరణంలో జరుపుకొందాం. రాష్ట్రంలో చారిత్రక విజయం అనంతరం జరుగుతున్న ఆవిర్భావ దినోత్సవం ఇది. పాయకరావుపేట నియోజక వర్గం నుంచి జన సైనికులు, వీర మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి.
* హోమ్ మంత్రి శ్రీమతి అనితతో నేను మాట్లాడతాను
కాకినాడ నుంచి నరసాపురం వరకు పార్టీ ఆధ్వర్యంలో మత్స్యకార అభ్యున్నతి యాత్ర చేశాం. రెండో విడత పాయకరావు పేట నుంచి భీమిలి వరకు చేయాలని నిర్ణయించుకున్నాం. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల చేయలేకపోయాం. ఇప్పుడు అధికారంలో ఉన్నాం. ప్రత్యేక కార్యక్రమం ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసి మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాం. జన సైనికులు, వీరమహిళలు లేనిదే మేము లేము. మేము ఈ రోజు అసెంబ్లీలో కూర్చున్నామంటే దానికి కారణం క్షేత్ర స్థాయిలో మీరు పడ్డ కష్టమే. మీ కష్టాన్ని మేము ఏనాడు మరిచిపోము. పాయకరావుపేటలో పార్టీ శాసనసభ్యులు లేకపోయినా 14,355 సభ్యత్వాలు నమోదు చేశారు. మీరు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. మీ కష్టాన్ని గుర్తించేలా మేము పనిచేస్తాం. దశాబ్ధకాలంగా పార్టీ కోసం కష్టపడిన ప్రతిఒక్కరినీ గుర్తుపెట్టుకుని సముచిత న్యాయం కల్పిస్తాం. మీటింగ్ అనంతరం హోమ్ మంత్రి శ్రీమతి వంగలపూడి అనిత గారి ఇంటికి వెళ్లి పొత్తులో భాగంగా మనకు రావాల్సిన పదవుల గురించి మాట్లాడతాను. కూటమి అన్న తరువాత చిన్న చిన్న సమస్యలు సహజం. వాటిని అధిగమించేలా ప్రయత్నాలు చేద్దాం.
• మా మెజార్టీలకు కారణం మీరే
జనసేన పార్టీ తరఫున ఎన్నికైన శాసనసభ్యులకు 30వేలు, 40వేలు, 50వేలు, 80వేలు మెజార్టీలు వచ్చాయంటే దానికి కారణం జన సైనికులు, వీర మహిళలే. శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని బలపరచాలని ప్రతి ఒక్కరు ఎంతో కష్టపడ్డారు. ఇప్పుడు శాసనసభలో మన బలం శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఉంది. మన గళం వినిపించడానికి పార్లమెంటుకు ఇద్దరు ఎంపీలను పంపించారు. మాకు పదవులు వచ్చినంత మాత్రాన కొమ్ములు రాలేదు. మేము కూడా జన సైనికులమే. కాస్త బాధ్యత పెరిగింది కనుక స్టేజ్ మీద కూర్చున్నాం. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో నిస్వార్థంగా పనిచేసిన జన సైనికులు, వీర మహిళలను గౌరవించుకోవడానికి ఈ సభను ఏర్పాటు చేశాం. మీరంతా కలసి వచ్చి ఈ సభను జయప్రదం చేయాల”ని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు, పంతం నానాజీ, బొలిశెట్టి శ్రీనివాస్, వంశీకృష్ణ యాదవ్, సుందరపు విజయ్ కుమార్, కుడా ఛైర్మన్ తుమ్మల బాబు, పార్టీ నాయకులు కోన తాతారావు, గెడ్డం బుజ్జి, వి.గంగులయ్య, పీవీఎస్ఎన్ రాజు, సందీప్ పంచకర్ల, శ్రీమతి ఉషాకిరణ్, బి.శివదత్, అమ్మిశెట్టి వాసు, సూర్యచంద్ర, శ్రీమతి అంగ ప్రశాంతి, గుర్రాన అయ్యలు, మల్లాడి రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment