ప్లాస్టిక్ నివారణకు చర్యలు తీసుకోవాలి..!

అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ నందు స్పందనలో గౌరవ జిల్లా కలెక్టర్ చమకూరి శ్రీధర్ కి రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మరియు జనసేన, కూటమి నేతలతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్లాస్టిక్ ఎక్కువ తయారు కావడం వలన ప్రజలందరూ ఎక్కువ ప్లాస్టిక్ వస్తువులను వాడడం వలన తీవ్రత ఎక్కువ కావడంతో చాలా రకాలుగా ప్రజలు అనారోగ్య సమస్యలు భారిన పడుతున్నారని గుర్తు చేశారు. అదే క్రమంలో అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ప్లాస్టిక్ కవర్లను గ్లాసులను టి కప్పులను మరియు తదితర ప్లాస్టిక్ సంబంధించిన వస్తువులను నివారించి, ఎన్డీయే కూటమి ప్రభుత్వంలో ప్రజా ఆరోగ్యాల దృష్ట్యా ప్లాస్టిక్ నివారణకు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల వారీగా క్షేత్ర స్థాయిలో ప్లాస్టిక్ వాడకం వల్ల జరిగే ప్రమాదాన్ని ప్రజలకు అవగాహన సదస్సులు ద్వారా అరికట్టాలన్నారు. అలానే బీసీ ఉపకులాలలోని కుమ్మర కులస్తులకు వృత్తి రీత్యా మట్టితో తయారయ్యే వస్తువుల వాడకం తగ్గడంతో ఆ సామాజిక వర్గానికి జీవనోపాధి కరువై అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. పై విషయాలను వెంటనే పరిగణలోకి తీసుకుని కుమ్మరి కులస్తులకు కూటమి ప్రభుత్వం ద్వారా ప్రోత్సాహకంగా మట్టితో తయ్యార్ అవ్వే అన్ని రకాల వస్తువులకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు రామణగౌడ, తెలుగుదేశం రాజంపేట పార్లమెంటరీ మహిళా కార్యదర్శి మరియు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి మల్లూరు సునీత, జనసేన, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment