హైదరాబాద్‌కు యునెస్కో గుర్తింపు తెచ్చే దిశగా అడుగులు: మంత్రి కేటీఆర్

భాగ్యనగరంలోని ఐకానిక్ కట్టడాలలో ఒకటైన మోజంజాహి మార్కెట్‌ను మంత్రి కేటీఆర్ పునఃప్రారంభించారు. 1935లో నిర్మించిన ఎంజే మార్కెట్‌ను మళ్లీ 85 ఏళ్ల తరువాత పునరుద్ధరణ చేశారు. పునరుద్ధరణ పనులు పూర్తయిన నేపథ్యంలో మంత్రి కేటీఆర్ నేడు ఎంజే మార్కెట్‌ను ప్రారంభించారు. ఎంజే మార్కెట్ పునఃప్రారంభోత్సవం సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. 1935లో నిర్మించిన ఎంజే మార్కెట్‌ను రూ.15 కోట్లతో ఇప్పుడు పునరుద్ధరించామన్నారు. పునరుద్ధరించిన ఎంజే మార్కెట్‌ను పరరిక్షించుకునే బాధ్యత అందరిపై ఉందన్నారు. అప్పట్లో తాము ఇక్కడకి ఫేమస్ ఐస్ క్రీమ్ కోసం వచ్చేవాళ్లమని కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. హైదరాబాద్‌కు యునెస్కో గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అనేక చారిత్రక నిర్మాణాలను మంచిగా చేయడం కోసం తెలంగాణా  ప్రభుత్వం ముందుంటుంది అని ఆయన తెలిపారు.