స్టిగ్మ మరియు రిడక్షన్ అవగాహనా కార్యక్రమం

పొదిలి, స్టిగ్మ మరియు రిడక్షన్ పైన అవగాహన కార్యక్రమంలో భాగంగా శనివారం పొదిలి మండలంలోనీ ప్రభుత్వ హాసుపత్రిలో సామాజిక కార్యకర్త పొదిలి జనసేన పార్టీ నాయకులు శ్రావణి వెంకటేశ్వర్లు సహకారంతో, ప్రకాశం జిల్లా చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్కర్స్ స్కీమ్ ఆద్వర్యంలో హెచ్.ఐ.వి పేషెంట్స్ కి పోషక ఆహారం వాటి విలువలు, అనే అంశంపై అవగాహన తెలియజేస్తూ 20 మంది పేషంట్స్ కి నిత్యావసర పోషక ఆహార వస్తువులు సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామిరెడ్డి, డాక్టర్ శివపార్వతి, డి ఆర్ పి గాలి స్వరూప్ కుమార్, ఐసిటిసి కౌన్సిలర్ హనుమంతరావు, శ్రవణ్ కుమార్, కుమారి జోనల్ సూపర్వైజర్ భాస్కర్, లింక్ వర్కర్స్ గాంధీ, వెంకటేష్, సురేష్ తో పాటు, ఫిల్మ్ డైరెక్టర్ కేశవ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు.

Share this content:

Post Comment