అక్రమ మైనింగుకు అడ్డుకట్ట వెయ్యండి

  • మైనింగ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్రని కలిసిన చోడవరం జనసేన పార్టీ ఇంచార్జ్ పివిఎస్ఎన్ రాజు.

శనివారం అనకాపల్లి పర్యటనకు విచ్చేసిన జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు మరియు మైనింగ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్రని కలిసిన చోడవరం జనసేన పార్టీ ఇంచార్జ్ పివిఎస్ఎన్ రాజు. ఈ సందర్భంగా పివిఎస్ఎన్ రాజు మంత్రివర్యులకు చోడవరం నియోజవర్గంలో రోలుగుంట మండలంలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న మైనింగ్ వలన ప్రజలకు అనేక ఇబ్బందులు కలుగుతున్నాయని, అలాగే గ్రామాలలో రహదారులు శిధిలం అయిపోతున్నాయని, ఇరిగేషన్ మరియు రెవెన్యూ అనుమతులు లేకుండా క్వారీలకు రహదారులు నిర్మాణం చేయడం లాంటి అన్ని అతిక్రమణలను వారికి పూర్తిగా వివరించారు.ఈ సందర్భంగా మంత్రివర్యులు మాట్లాడుతూ దీనిపై సమగ్ర విచారణకు ఆదేశిస్తానని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, కూటమి ప్రభుత్వం ఇటువంటి అక్రమాలను సహించదని ఇటువంటి విషయాలు పట్ల ఎటువంటి అశ్రద్ధ చేయకుండా అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.

Share this content:

Post Comment