చిల్లర రాజకీయాలు మాని ప్రజా సమస్యలపై దృష్టి పెట్టండి: బొబ్బేపల్లి సురేష్

సర్వేపల్లి, వెంకటాచలం మండలం సర్వేపల్లి గ్రామంలో జనసేన పార్టీ అభిమానులు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు జన్మదిన పురస్కరించుకొని శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన భారీ కటౌట్ ని కొందరు వైసీపీ నాయకులు కావాలని వారి చంచాల చేత చించి వేయించడంపై జనసేన పార్టీ నాయకులతో కలిసి శనివారం బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఘాటుగా విమర్శించారు. ఈ సందర్భంగా బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ సర్వేపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలపడుతుందన్న భయంతో నిరంకుశ రౌడీ పాలన చేస్తున్న దుష్ట శక్తులు అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతూ వస్తున్నారు. అందులో భాగంగా గతంలో మూడుసార్లు జనసేన పార్టీ ఫ్లెక్సీలను చించేయడం జరిగింది. అదేవిధంగా మార్చి 31వ తారీకు సర్వేపల్లి గ్రామంలో కట్టిన భారీ కటౌట్ ని ఆదివారం ఉదయాన్నే చూసేసరికి చించి వేయబడింది. కటౌట్ లకి భయపడేటువంటి పరిస్థితుల్లో ఉన్న గల్లి నాయకులు చిల్లర రాజకీయాలు మానుకొని ప్రజా సమస్యలపైన దృష్టి పెట్టండి. అదేవిధంగా రాబోయే 2024 ఎన్నికల్లో నిరంకుశ పాలన చేసే రౌడీ గూండాలకు ఓటు ద్వారా ప్రజలే బుద్ధి చెబుతారు. జనసేన పార్టీ కటౌట్ ని చించి వేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వెంకటాచల మండలం సిఐ గంగాధర్ కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు త్వరలోనే దానిపై విచారణ జరిపి కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు పిన్నిశెట్టి మల్లికార్జున్, శ్రీహరి, రహీమ్, అక్బర్, చిన్న, రహమాన్ తదితరులు పాల్గొన్నారు.