స్టోరేజ్ ట్యాంక్ పనులను తక్షణం పూర్తిచేయాలి: రాందాస్ చౌదరి

మదనపల్లి మండలం, చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ మొరవను, చెరువును జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సిగ్గు లేని వైసీపీ ప్రభుత్వం సమ్మర్ స్టోరేజ్ పనులను పూర్తి చేయలేదని తీవ్రంగా మండిపడ్డారు. హంద్రీ నివా నీటిని ఈ సమ్మర్ స్టోరేజ్ లో స్టోరేజ్ చేసి మదనపల్లి దాహర్తిని తీర్చవచ్చు కానీ ఈ చేత కానీ ప్రభుత్వం వలన మోరవ పని పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా ఉన్నారని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి గారు అందరూ ఇకనైనా ఈ సమ్మర్ లో మొరవ పని పూర్తి చేసి, వర్షా కాలంలో నీటిని స్టోరేజ్ చేసి మదనపల్లి దాహర్తి తీర్చేలా చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం రాయల్, రాష్ట్ర చేనేత విభాగ నాయకులు అడపా సురేంద్ర, ఐటి విభాగ నాయకులు జగదీష్, మదనపల్లి మండల రూరల్ అధ్యక్షులు గ్రానైట్ బాబు, జనార్ధన్, సనావుల్లా, రెడ్డమ్మ, నాగ, నగేష్, నవాజ్, మోహన, శేఖర, వేణు, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.