కాకినాడ రూరల్ నియోజకవర్గం, కరప మండలం కరప పంచాయితీ శివారు గ్రామం పేపకాయల పాలెం గ్రామంకు వెళ్లే రోడ్డు మార్గం చిమ్మ చీకడను తలపించే విధంగా ఉండడంతో రాత్రుళ్ళు విద్యార్థులు ఈ మార్గం గుండా రాకపోకలు సాగిస్తూ ఉంటారు.ముఖ్యంగా ఆడవారు రాత్రులు ప్రయాణం చేయాలంటే రవాణా సౌకర్యం ఆలస్యం అవడంతో కాలినడకన ప్రయాణం సాగిస్తూ ఉంటారు. ఆకతాయిలా ఇబ్బందులు ఉండేవి. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ సమస్య పరిష్కారం దిశగా స్థానిక జనసేన పార్టీ సీనియర్ నాయకులు భోగిరెడ్డి కొండబాబు ఆధ్వర్యంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి భోగిరెడ్డి గంగాధర్ కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పంతం నానాజీ దృష్టికి సమస్య తీసుకు వెళ్లడంతో ఎమ్మెల్యే ఆదేశాలతో దారి పొడవునా వీధిలైట్లకు క్రొత్త వైరు మరియు స్తంభాలను ఏర్పాటు వేయడం జరిగింది. త్వరలో వీధి దీపాలను అమర్చడం జరుగుతుంది.
Share this content:
Post Comment