*స్థానిక ఎన్నికల విజయానికి చోడవరం జనసేన చొరవ
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘనవిజయం సాధించేందుకు జనసేన పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని చోడవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పివిఎస్ఎన్ రాజు పిలుపునిచ్చారు. కొత్తకోటలో నిర్వహించిన రావికమతం, రోలుగుంట మండల గ్రామ పార్టీ అధ్యక్షుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని మరింత పటిష్ఠం చేసుకోవాలనే దిశగా, నాయకులంతా ఒకే లక్ష్యంతో పనిచేయాలని సూచించిన ఆయన, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, కూటమి ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. పవన్ కళ్యాణ్ గారి సేవా దృక్పథం, చంద్రబాబు నాయుడు గారి విజన్ 2047ను దృష్టిలో ఉంచుకొని గ్రామాల అభివృద్ధికి గ్రౌండ్ వర్క్ వేయాలన్నారు. వచ్చే స్థానిక ఎన్నికల్లో కూటమి తరపున 100% విజయాన్ని సాధించాలన్నదే లక్ష్యంగా రాజకీయ భేదాభిప్రాయాలకు తావు లేకుండా, సమరసతతో ముందుకు సాగాలన్నారు. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు మైచర్ల నాయుడు, బలిజ మహారాజు సహా పలు గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామస్థాయిలో సమన్వయమే పార్టీ బలోపేతానికి పునాది అవుతుందని ఈ సమావేశం స్పష్టం చేసింది.
Share this content:
Post Comment