సోషల్ మీడియా అకృత్యాలకు పాల్పడిన రవీంద్ర రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలి

  • రాయలసీమ రీజనల్ కో- ఆర్డినేటర్ కుప్పల జ్యోతి

రాజంపేట నియోజకవర్గం: రాజంపేట జనసేన కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో శనివారం రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ కుప్పల జ్యోతి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిపై సోషల్ మీడియాని వేదికగా చేసుకొని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డీఎస్పీ గారికి వినతిపత్రం అందజేయడం జరిగిందని ఆమె తెలియజేశారు. నేటి ఆంధ్ర రాష్ట్ర దుస్థితి ఏ విధంగా ఉందంటే కనీసం మహిళలకు స్వేచ్ఛ లేకుండా పోతుంది రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మహిళలపై అన్యాయాలను చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆమె తెలియజేశారు. అంతేకాకుండా అదే సోషల్ మీడియా వేదికగా ప్రజలందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ అన్నయ్య వ్యక్తిగత జీవితాలపై అధికార పార్టీకి చెందిన నాయకులు మహిళలు విమర్శించడం సరికాదు అని ఆమె పేర్కొన్నారు. ఈ రోజు మీరు చేసిన అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రానికి తెలుసు మీరు తెచ్చిన పరిశ్రమలు ఎన్ని మీరు ఎంతమందికి ఉపాధి కల్పించారో మీ సొంత జిల్లా అయినటువంటి కడప జిల్లా అభివృద్ధి మీరు చేసింది ఏంటి ఒకసారి పవన్ కళ్యాణ్ అన్నయ్య ప్రశ్నిస్తే మీ దగ్గర సమాధానం ఉందా? అని ప్రశ్నించారు.
నిజాయితీగా పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర సమస్యలపై పోరాడుతుంటే అధికారం మదంతో ప్రజలకు సాయం చేయడం చేతగాని మీరు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితంపై మాట్లాడే హక్కు ఉందా అని ప్రశ్నించారు. ఇకపోతే ఎంత దిగజారుడు రాజకీయం చేస్తున్నారంటే పనిగట్టుకొని మరి ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ సృష్టించి మరీ పవన్ కళ్యాణ్ అన్నయ్యపై బురద చల్లాలని ప్రయత్నిస్తున్నారు. ఎలాగో 2024లో నీ సొంత జిల్లా కడప జిల్లాలో నీకు కుర్చీ ఉందో లేదో గుర్తుంచుకో అని హెచ్చరించారు. మీ ఇంట్లో ఆడపడుచులు లేరా ఒకరిని మనం వేలెత్తి చూపిస్తున్నాము అంటే మనల్ని 3వేళ్ళు చూపిస్తాయని గుర్తుంచుకోవాలి. పవన్ కళ్యాణ్ అన్నయ్య ఏరోజైనా మీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడి ఉంటారా. మీరు ఇలాంటి దిగజారుడు రాజకీయం చేసేటప్పుడు మీ ఇంట్లో మీ ఆడపడుచులు గుర్తు రాలేదా.. ఇకనైనా పనికిమాలి నీతిలేని రాజకీయాలను చేయడం మాని, దీటుగా మా పవన్ కళ్యాణ్ అన్నయ్యలాగా ప్రజల సమస్యలను వెతికి ఆ సమస్యలను పరిష్కరిస్తున్నారు. మీరు చేయాలంటే ఆ విధంగా చేయండి అంతేకానీ పవన్ కళ్యాణ్ అన్నయ్య మీద వారి కుటుంబ సభ్యుల మీద దిగజారుడు రాజకీయాన్ని చేయొద్దండి. దీటుగా రాజకీయం చేతకాక తెరచాటు రాజకీయాలు మానండని ఆమె తెలియజేశారు. పోలీసు వ్యవస్థను నేను ఒకటే కోరుతున్నాను ఇటువంటి చర్యలకు పాల్పడిన వర్రా రవీంద్రరెడ్డి అనే వాడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.