తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి: తిరుపతి జనసేన

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మరియు వారి కుటుంబ సభ్యులపై అధికార పార్టీకి చెందిన కొందరు సోషల్ మీడియా మాధ్యమాలలో అసభ్యకర పోస్టులు పెడుతున్న నేపథ్యంలో తిరుపతి జనసేన నాయకులు, వీరమహిళలు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఇలాంటి వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని వారి అకౌంట్లో బ్లాక్ చేయాలని వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర కార్యదర్శి ఆకేపాటి సుభాషిని, రాయలసీమ కోఆర్డినేటర్ వనజమ్మ మరియు వీర మహిళలు నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై వారి కుటుంబ సభ్యులపై ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిని కఠినంగా శిక్షించాలని వారి ఇండ్లలో కూడా ఆడవారు ఉన్నారనే విషయం గుర్తుపెట్టుకోవాలని, కనీసం ఇలాంటి పనులు చేసేవారి ఇళ్లలో ఆడవారు వీరికి బుద్ధి చెప్పాలని ఇలాంటివి మళ్లీ జరిగితే ఈసారి మా వీరమహిళలు అందరూ కలిసి సీఎం ఇంటిని ముట్టడిస్తామని, ఇలాంటి పనులు చేస్తున్న వారికి రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి ఇది తప్పు అని చెప్పలేని దుస్థితిలో ఉన్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జనసేన ఇన్చార్జ్ కిరణ్ రాయల్, రాజారెడ్డి రాష్ట్ర నాయకురాలు ఆకేపాటి సుభాషిణి, వనజ,ముక్కు సత్యవంతుడు, కిషోర్, ఆదికేశవులు, పురుషోత్తం, బాబు, సాయికుమార్, లక్ష్మి, దుర్గ, చందన తదితరులు పాల్గొన్నారు.