స్ట్రాంగ్ రూమ్‌ల తనిఖీ

అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏ.ఎస్. దినేష్ కుమార్ ఆధ్వర్యంలో, జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ మరియు అరకు పార్లమెంట్ ఇంచార్జ్ డా.వంపూరు గంగులయ్య ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఐటీ టీమ్ కో ఆర్డినేటర్ సీ.హెచ్.అనిల్ కుమార్, పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళీ కృష్ణ పాల్గొని ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం భద్రతపరమైన ఓట్ల స్ట్రాంగ్ రూమ్‌లను తనిఖీ చేశారు. పాడేరు మండలం ప్రభుత్వం డిగ్రీ కళాశాలలో భద్రత పరిరక్షణలో ఉన్న ఎమ్మెల్సీ ఓట్ల బాక్సులను పోలీస్ సిబ్బంది కఠిన సెక్యూరిటీతో రక్షిస్తున్నారు. వీటిని వేరే చోట తరలించనున్నారని కలెక్టర్ గారు తెలియజేశారు. ఓట్ల బాక్సులను కూటమి నాయకుల ఆధ్వర్యంలోనే తరలిస్తామని, ఆ సందర్భంలో మీరు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు సీ.హెచ్. అనిల్ కుమార్, నందోలి మురళీ కృష్ణ మాట్లాడుతూ, ఓట్ల బాక్సులను తరలించే సమయంలో సమాచారం అందిస్తారని, తాము హాజరవుతామని చెప్పారు. అలాగే పాడేరు, అరకు, రంపచోడవరం వంటి వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్‌లను కలెక్టర్ తో కలిసి పరిశీలించారు. ఈ తనిఖీల ద్వారా భద్రతకు సంబంధించిన పూర్తి స్థాయి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. ఈ కార్యక్రమంలో డిర్ఓ పద్మ లత, ఏం ఆర్ ఓ త్రినాథ్ సుపరిడెంట్ తిరుమల రావు, శ్రీను రాజేష్ ఢీటీ, బీజేపీ యూత్ వింగ్ పాత్రుడు, టీడీపీ ఏం పీటీసీ శివ, సీనియర్ నాయకులు జ్యోతి కిరణ్ రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది కూటమి ప్రతినిధులు కూటమి నాయకులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment