*ఐ.పంగిడి జెడ్ పి పాఠశాలలో విద్యార్థులతో భోజనం చేసి నాణ్యతను పరిశీలించిన జనసేన నేతలు
కొవ్వూరు మండలంలోని, ఐ.పంగిడి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం జనసేన నేతలు ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో అందిస్తున్న భోజన నాణ్యతను పరిశీలిస్తూ, విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేందుకు కట్టుబడి ఉందని, విద్యార్థులు మేలైన ర్యాంకులు సాధించాలని ఆకాంక్షించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన నూతన భోజన విధానంలో భాగంగా, సన్నబియ్యంతో అందిస్తున్న ఆహారం పిల్లలకు రుచికరంగా అనిపిస్తూ, ఆనందంగా స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఐ.పంగిడి జనసేన నాయకులు చౌటిపల్లి సాంబ శివరావు, మడిచర్ల భద్రం, జొన్నకూటి సుమన్, పేపకాయల వీరన్న, చౌటిపల్లి రాంబాబు, మావూడూరి రాజు, బీసీ నాయకులు డి.ఎన్.ఎల్. ప్రసాద్, నర్రా వీరన్న, పేపకాయల వాసు తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment