- ఏ.కే.యూ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ సోమ శేఖర విజ్ఞప్తి
డిగ్రీ ఫైనల్ ఇయర్ పూర్తి చేసుకున్న విద్యార్థినీ విద్యార్థులు భవిష్యత్ లో స్నాత కోత్తర స్థాయిలో ఏయే కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు చేసుకోవాలో అనే విషయంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఆంధ్ర కేసరి యూనివర్శిటీ డి.ఓ.ఏ విభాగం ఆద్వర్యంలో బుధవారం ఒంగోలు లోని శ్రీ నాగార్జున డిగ్రీ కళాశాల ప్రాంగణంలో “స్టూడెంట్ కెరీర్ గైడెన్స్ ఆన్ పీజీ కోర్సెస్ ఇన్ ఏ.కే.యూ” అనే అంశంపై అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సమావేశానికి ఆంధ్ర కేసరి యూనివర్శిటీ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ జి.సోమ శేఖర అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న విద్యాసంవత్సరం నందు పీజీ కోర్సుల్లో ప్రవేశానికి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అన్ని సెట్ లకు ఎంట్రన్స్ పరీక్షల నిమిత్తం నోటిఫికేషన్ జారీ చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఆంధ్ర కేసరి యూనివర్శిటీ నందు ప్రస్తుతం 13 కోర్సులు అందుబాటు లో ఉన్నాయని, వాటికి సంబంధించి ప్రవేశాల కోసం విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆంధ్ర కేసరి యూనివర్శిటీ ఏ.సి.ఈ డాక్టర్ అంచుల భారతీ దేవి మాట్లాడుతూ ఏ.పి.పీజీ సెట్ ఎంట్రన్స్ పరీక్ష లను 9-6-3025 నుంచి 13-6-2025 వరకు, ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగంలో ప్రవేశాల కోసం 25-06-2025 న ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్ర కేసరి యూనివర్శిటీ నందు పి.జి. ప్రవేశాలతో పాటుగా పిహెచ్.డి అడ్మిషన్లు కూడా నిర్వహిస్తున్నామని, 2025-26 విద్యా సంవత్సరంలో ఆంధ్ర కేసరి యూనివర్శిటీ నందు పిహెచ్.డి ప్రవేశం కోసం పీజీ పూర్తి చేసుకున్న వారిలో ఆసక్తి కలిగిన విద్యార్థులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మే,2వ తేదీ నుంచి మే,5వ తేదీ వరకు చేపట్టే ఏ.పి.ఆర్.సెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలన్నారు. ఐసెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ర్యాంకుల ఆధారంగా ఎం.బి.ఏ విభాగంలో ప్రవేశానికి అవకాశం కల్పిస్తామని కామర్స్ అండ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంటు సహాయ ఆచార్యుడు డాక్టర్ జడ.అరుణ్ కుమార్ తెలిపారు. ఆంధ్ర కేసరి యూనివర్శిటీ నందు పి.జి.అడ్మిషన్ల కోసం పూర్తి వివరాలు కావాల్సిన విద్యార్థులు యూనివర్శిటీ పని వేళల్లో డి.ఓ.ఏ కార్యాలయం నందు స్వయంగా సంప్రదించ వచ్చు. దూర ప్రాంత విద్యార్థులు సెల్ మెంబర్లు: 6304343448, 8978496178 లలో సంప్రదించాలని ఏ.కే.యూ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొఫెసర్ జి సోమ శేఖర తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర కేసరి యూనివర్శిటీకి చెందిన సహాయ ఆచార్యులు డాక్టర్ ఆర్.శ్రీనివాస్ (సోషల్ వర్క్ విభాగం), డాక్టర్ ఈత ముక్కల(కెమిస్ట్రీ డిపార్టుమెంటు), కోలా సాయి బాబు(కంప్యూటర్స్ డిపార్టుమెంటు), శ్రీ నాగార్జున డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.యోగయ్య చౌదరిలతో బాటు ఏ.కే.యూ.డి.ఓ.ఏ విభాగం సిబ్బంది పాల్గొన్నారు.
Share this content:
Post Comment