మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి దిశగా ఎన్.ఆర్.ఐ విభాగం అధ్యయనం

  • పిఠాపురం నియోజకవర్గంలో మత్స్యకారుల అభ్యున్నతి మరియు సంక్షేమం కోసం తీసుకోవాల్సిన చర్యలపై జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ప్రత్యేక ద్రుష్టి
  • మత్స్యకారులు ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా అధ్యయనం చేపట్టిన జనసేన ఎన్.ఆర్.ఐ విభాగం సభ్యులు శశిధర్ యాదవ్
  • జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కొణిదల నాగబాబు గారు ఉప్పాడ కొత్తపల్లి మత్స్యకారులతో వీడియో కాల్ ద్వారా సంభాషణ

పిఠాపురం నియోజకవర్గం: పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు ఉప్పాడ కొత్తపల్లి మండలం అమీనాబాద్ మత్స్యకారులతో భేటీ అయ్యారు. ఇంచార్జ్ ఉదయ్ శ్రీనివాస్ సూచనలు మేరకు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న మత్స్యకారులు ఆర్ధికంగా ఎదిగేలా, స్థానిక సమస్యలు పరిష్కరం అయ్యే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసేందుకు విచ్చేసిన శశిధర్ యాదవ్ గారు వేటకు వెళ్లే విధానం వారి యొక్క స్థితిగతులు గురించి నేరుగా అడిగి తెలుసుకుంటూ వారితో కలిసి బోటులో కాసేపు పర్యటించారు. ఈ సందర్బంగా మత్స్యకారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇంచార్జ్ ఉదయ్ శ్రీనివాస్ గారు సూచనలు మేరకు గత కొన్ని రోజులుగా ఉప్పాడ కొత్తపల్లి మండలంలో గల గ్రామాలను సందర్శించి అనేక సమస్యలును గుర్తించము అని కొన్ని గ్రామాలలో మత్స్యకారుల ప్రాంతాలకు రక్షిత మంచినీటి సౌకర్యం మరియు స్మశానవాటికలు లేకపోవడం తీవ్రంగా కలచి వేసింది అని గ్రామాల్లో సమస్యలు నాడు నేడు ఒకేలా ఉండటం పట్ల
ఆవేదన చెందారు. స్థానికంగా నేను విదేశాల్లో స్థిర పడ్డాను అని నా దేశానికీ ఏమైనా చేయాలి అని పవన్ కళ్యాణ్ గారు లాంటి దేశ నాయకులతో పని చేస్తున్నందుకు గర్వపడుతున్నాను అని తెలియజేస్తూ, దేశవ్యాప్తంగా మత్స్య వృత్తిపై ఆధారపడి ప్రత్యక్షంగా మూడు కోట్ల మంది మత్స్యకారులు ఉపాధి పొందుతున్నారు, దేశానికి కోట్లాది రూపాయల విదేశీ మారక ద్రవ్యాన్ని మత్స్య సంపద ఎగుమతుల ద్వారా సంపాదిస్తున్న మత్స్యకారులకు మొదటిగా ప్రత్యేకంగా ధన్యవాదములు తెలియజేసారు. స్థానిక మత్స్యకారుడు శ్రీ పూరి జగన్నాధం గారి బోటులో జనసేన నాయకులు మరియు యువతతో మాట్లాడుతూ సంవత్సరాల తరబడి సముద్ర తీరాన్ని నమ్ముకుని జీవనం సాగిస్తున్న ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే దిశగా ఇంచార్జ్ ఉదయ్ శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళతారు అని భరోసా కల్పించారు. గ్రామాలను కోల్పోకుండా రక్షణ కొరకు మరియు ఆర్ధికంగా ఎదిగేలా అన్నీ విధాలుగా అభివృద్ధి చెందేలా ప్రత్యేకంగా ప్రణాళిక చేస్తున్నాం. దానిలో భాగంగా జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక 58 ఏళ్ళు పై బడిన మత్స్యకారులకు 5000 రూపాయల పెన్షన్ మరియు మత్స్య పరిశ్రమల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ, సంక్షేమ పథకాలు అలాగే నాన్ ఫిషింగ్ టైం లో మత్స్యకారులకు రోజుకు 500 రూపాయల ఆర్థిక సహాయం అందించడానికి కట్టుబడి ఉన్నాం అని తెలియజేశారు. అనంతరం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కొణిదల నాగబాబు గారితో వీడియో కాల్ మాట్లాడి స్థానిక నాయకులును పరిచయం చేసి నేరుగా ప్రస్తుత పరిస్థితిలు గురించి అడగగా మత్స్యకారులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పరిధిలో సుమారు 1075 కిలో మీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. వాటి పరిధిలో సుమారు 10 జిల్లాలకు సంబంధించిన 500కు పైగా మత్స్యకార గ్రామాలు జీవనం సాగిస్తున్నాయి. ఎక్కడ చూసినా అనేక ఇబ్బందికర పరిస్థితులు కనపడుతున్నాయి అని పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ గల నాయకుడు ముఖ్యమంత్రి ఐతే రాష్ట్రానికి ముఖ్యంగా మా మత్స్యకారులకు మేలు జరుగుతుంది అని ఆశభావం వ్యక్తం చేశారు.