పుష్ప సెట్‌లో అభిమానితో స్టైలిష్ స్టార్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప సినిమాతో బిజీగా ఉన్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌, వారి నేరమయ జీవనంలోని భిన్న పార్శాల్ని ఆవిష్కరిస్తూ ఎమోషనల్‌ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. రీసెంట్‌గా ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళగా, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మారేడుమిల్లి అరణ్యంలో చిత్రీకరణ జరుగుతోంది. అల్లు అర్జున్‌తో పాటు చిత్ర ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు.

తాజాగా అల్లు అర్జున్ పుష్ప చిత్ర సెట్‌లో అభిమానితో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇవి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. అల్లు అర్జున్ హెయిర్ స్టైల్ ఫ్యాన్స్ కు తెగ నచ్చేసింది. పుష్పరాజ్‌ కూలీ నుంచి స్మగ్లర్‌గా ఎందుకు అవతారమెత్తుతాడు, అనూహ్యంగా చోటుచేసుకున్న పరిణామాల్లో అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందనేది పుష్ప సినిమాలో చూపించనున్నారు. రష్మిక మంధాన ఇందులో కథానాయికగా నటిస్తుంది.