వెలిగొండ ప్రాజెక్టు మరియు మార్కాపురం ప్రత్యేక జిల్లా కోసం విజయవంతంగా రెండవ రోజు పాదయాత్ర

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం నుంచి మొదలైన వెలిగొండ ప్రాజెక్ట్ మరియు ప్రత్యేక జిల్లా కోసం జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ ఇమ్మడి కాశీనాధ్ తలపెట్టిన పాదయాత్ర రెండవ రోజు పెద్దయాచవరం నుంచి మన్నంవారిపల్లే, నాయుడిపల్లే మీదుగా రాయవరం నుంచి కలుజువ్వలపాడు వైపుగా జనసంద్రంతో విజయవంతంగా సాగినది. ఈ పాదయాత్రకు మద్దతుగా గ్రామస్థులు అడుగడుగునా బ్రహ్మరథం పట్టడం జరిగింది. జనసేన తలపెట్టిన ఈ పాదయాత్రకు దారివెంట తెలుగుదేశం పార్టీ నాయకులు సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మార్కాపురం తెలుగుదేశం పార్టీ నాయకులు, మార్కాపురం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.