సుమంత్‌- దీపికల హల్దీ వేడుక

టాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత ఎంఎస్ రాజు తనయుడు సుమంత్ అశ్విన్ ఫిబ్రవరి 13న పెళ్లి పీటలెక్కనున్నాడని ఇటీవల రాజు తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. సుమంత్ చేసుకోబోయే అమ్మాయి పేరు దీపిక కాగా, ఈమెది హైదరాబాదే. శనివారం రోజు హైదరాబాద్‌లోని ఫామ్‌హౌజ్‌లో వీరి వివాహ వేడుక జరగనుంది. కరోనా ఇప్పటికి ఉన్న సమయంలో కేవలం సుమంత్ పెళ్లి వేడుక పరిమిత సంఖ్యలో బంధుమిత్రుల సమక్షంలో జరపనున్నారు. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లన్ని పూర్తి చేసినట్టు తెలుస్తుంది. . అయితే తాజాగాహల్దీ వేడుకలు నిర్వహించగా ఇందులో ఇద్దరి ముఖాలు సిగ్గుతో వెలిగిపోతున్నాయి.

సుమంత్‌- దీపికల హల్దీ వేడుకకు సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కాగా, ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారని కామెంట్స్ పెడుతున్నారు. సుమంత్ 2012లో తూనీగ తూనీగ అనే సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చారు. 2015లో చేసిన ‘కేరింత’ సినిమాతో సుమంత్ అశ్విన్ మంచి హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత కొలంబస్, రైట్ రైట్, ఫ్యాషన్ డిజైనర్, సన్ ఆఫ్ లేడీస్ టైలర్, హ్యాపీ వెడ్డింగ్, ప్రేమకథా చిత్రమ్ 2 చిత్రాలు చేసిన మంచి హిట్ అందుకోలేకపోయాడు. ప్రస్తుతం సుమంత్ ‘ఇదే మా కథ’ అనే సినిమా చేస్తుండగా, ఫిబ్రవరి 19న విడుదల కానున్నట్టు తెలుస్తుంది.