ఎమ్మెల్సీ హరిప్రసాద్ ని కలిసిన సుంకర శ్రీనివాస్

మంగళగిరి, జనసేన పార్టీ ఉమ్మడి కడప జిల్లా కోఆర్డినేటర్ & కడప అసెంబ్లీ ఇంచార్జ్ సుంకర శ్రీనివాస్, శనివారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరిలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ & ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సుంకర శ్రీనివాస్ ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. భేటీ సమయంలో కడప జిల్లాలో రాజకీయ పరిణామాలు, జనసేన కార్యకర్తలకు ఇచ్చే ప్రాధాన్యం, రాబోయే కడప మున్సిపల్ ఎన్నికలు, మేయర్ అభ్యర్థుల ఎంపిక వంటి కీలక అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశం పార్టీ బలోపేతానికి, జిల్లాలో పార్టీ కార్యాచరణకు దిశానిర్దేశం చేసినట్లు నేతలు తెలిపారు.

Share this content:

Post Comment