కడప, జనసేన పార్టీ ఉమ్మడి కడప జిల్లా కో-ఆర్డినేటర్ సుంకర శ్రీనివాస్ రాజంపేట టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు జగన్ మోహన్ రాజు మరియు రాజంపేట టీడీపీ ఇంచార్జ్ బాల సుబ్రమణ్యంలతో శుక్రవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. జనసేన పార్టీ ఉమ్మడి కడప జిల్లా కో-ఆర్డినేటర్ మరియు కడప అసెంబ్లీ ఇన్‌చార్జ్ సుంకర శ్రీనివాస్ రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రాజుని రాయచోటిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు అనంతరం రాజంపేట టీడీపీ ఇంచార్జ్ బాల సుబ్రమణ్యంని రాయచోటిలో వారి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా, రెండు పార్టీల మధ్య పొత్తు ధర్మం, రాజంపేట నియోజకవర్గ పరిణామాలు, జనసేన క్యాడర్‌కు రావాల్సిన నామినేటెడ్ పోస్టులపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. జనసేన క్యాడర్‌కు తగిన ప్రాధాన్యత ఇచ్చి, అర్హులైన నేతలకు న్యాయం జరగాల్సిన అవసరం గురించి సుంకర శ్రీనివాస్ స్పష్టంగా వివరించారు. ఈ సమావేశంలో పొలిటికల్ సెక్రటరీ ఫ్రాన్సిస్ మరియు ఆలీ, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Share this content:
Post Comment