*కడపలో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
తెలుగుదేశం పార్టీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కడప జిల్లాలోని నూతనంగా నిర్మించబడుతున్న టీడీపీ కార్యాలయం వద్ద జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ ఉమ్మడి కడప జిల్లా కోఆర్డినేటర్ మరియు కడప అసెంబ్లీ ఇంచార్జ్ శ్రీ సుంకర శ్రీనివాస్ గారు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి చంద్రబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ “చంద్రబాబు నాయుడు గారు నయవంచనలేని నాయకత్వానికి, కాలాన్ని దాటి చూసే దార్శనికతకు, పారదర్శక పాలనకు ప్రతిరూపం. మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో ఆయన కలసి నడుస్తున్న మైత్రి బంధం ప్రజల ఆశలను నెరవేర్చే దిశగా సాగుతోంది. ఉమ్మడి మరియు విభజిత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో చంద్రబాబు గారి పాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది,” అని పేర్కొన్నారు. అనంతరం పర్యావరణ పరిరక్షణకు సంకేతంగా చెట్లను నాటారు. ఈ వేడుకల్లో కడప శాసన సభ్యురాలు మరియు ప్రభుత్వ విప్ శ్రీమతి మాధవి గారు, టీడీపీ కడప జిల్లా అధ్యక్షులు శ్రీ రెడ్డప్పగారి శ్రీనివాస రెడ్డి, గోవర్ధన రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు. జనసేన పార్టీ తరఫున ఉమ్మడి కడప జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ పత్తి విశ్వనాథ్, కడప నగర అధ్యక్షులు బోరెడ్డి నాగేంద్ర, అజయ్ వర్మ, చార్లెస్, కొవ్వూరి అశోక్, నిమ్మలపల్లి వెంకటేష్, అనిల్ వర్మ, ఫ్రాన్సిస్, మల్లికార్జున, ఆరిఫ్, ఆలీ తదితర జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొని వేడుకను మరింత ఉజ్జ్వలంగా మార్చారు.
Share this content:
Post Comment