ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనున్న సన్‌రైజర్స్

దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఐపీఎల్‌ మ్యాచ్‌ లో ఈరోజు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. అయితే. ప్లే ఆఫ్స్‌ రేసులో భాగంగా ఈ మ్యాచ్‌ ఇరు జట్లకూ కీలకం కానుంది.  ప్లేఆఫ్ రేసులో ఇప్పటికే పంజాబ్, కోల్‌కతా, రాజస్థాన్ జట్లు.. ఆరెంజ్ ఆర్మీ కంటే ముందున్నాయి. సన్‌రైజర్స్ ఖాతాలో 8 పాయింట్లు మాత్రమే ఉండగా.. రాజస్థాన్ ఖాతాలో పది పాయింట్లు ఉన్నాయి. కింగ్స్ ఎలెవన్, నైట్ రైడర్స్ ఖాతాల్లో పది పాయింట్ల చొప్పున ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధిస్తే.. సన్‌రైజర్స్ ఖాతాలోనూ పది పాయింట్లు చేరతాయి. కానీ మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న వార్నర్ సేన.. రాజస్థాన్‌ను వెనక్కి నెట్టి ఆరో స్థానానికి చేరుకుంటుంది. మరోవైపు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఈ మ్యాచ్‌లో గెలిస్తే అగ్రస్థానానికి చేరుకోవడంతోపాటు.. ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తుంది. అటు ఢిల్లీకి.. ఇటు హైదరాబాద్‌కు బ్యాటింగ్ మైనస్‌గా మారింది. ఇక ఢిల్లీ జట్టు గత మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యం కారణంగా ఓడిపోయింది. కాబట్టి ఈ మ్యాచ్‌కు ఫుల్ లెంగ్త్ స్ట్రెంగ్త్‌తో బరిలోకి దిగనుంది.