శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి అస్తమయం బాధాకరం: పవన్ కళ్యాణ్

ప్రముఖ పండితులు, ప్రవచనకర్త శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి అస్తమించారు అనే విషయం బాధ కలిగించింది. ఉగాది రోజున పంచాంగ శ్రవణ కార్యక్రమంలో శాస్త్రి చెప్పే విశేషాలు ప్రతి తెలుగు వ్యక్తికీ చిరపరిచితమే. పురాణ, ఇతిహాస, వేద విశేషాలు ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా… అధ్యాత్మిక చింతన పెంచేలా శ్రీ చంద్రశేఖర శాస్త్రి ఉపన్యాసాలు సాగేవి. ధర్మ సందేహాలు, ధర్మ సూక్ష్మాలు కార్యక్రమాల ద్వారా హిందూ ధర్మంపై అవగాహన పెంచారు. శ్రీ చంద్రశేఖర శాస్త్రి ఆత్మకు శాంతి చేకూరాలని, సద్గతులు ప్రాప్తించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా తరఫున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు.