ధోని అభిమానులకు సూపర్ శుభవార్త

ధోని అభిమానులకు సూపర్ శుభవార్త. ఐపిఎల్ 2020 తో పాటు ఐపిఎల్ 2021 లోనూ మహేంద్ర సింగ్ ధోనీ కొనసాగుతాడని ఆశించవచ్చని.. అలాగే ఐపిఎల్ 2022 లో సైతం ధోనీ ఆడతాడని ఆశిస్తున్నట్టు ప్రస్తుత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్ ధీమా వ్యక్తంచేశారు.

ధోనీ రాంచీలోని స్టేడియంలో ఇండోర్ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడని, అతడి ప్రాక్టీసింగ్‌పై అనుమానాలు వ్యక్తంచేస్తూ మీడియాలో పలు కథనాలు చూస్తున్నాని చెప్పిన కాశీ విశ్వనాథన్, ధోనీకి తన బాధ్యతలు ఏంటి? ఏం చేయాలనే విషయాలు అన్నీ తెలుసునని ధోనీ సామర్ధ్యాలపై ధీమా వ్యక్తంచేస్తూ కాశీ విశ్వనాధన్  ఈ వ్యాఖ్యలు చేశారు.

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మార్చి నెలలోనే ప్రారంభం కావాల్సి ఉన్న ఐపిఎల్ 2020 టోర్నమెంట్ సెప్టెంబర్ 19కి వాయిదా పడిన విషయం తెలిసిందే. యూఏఈలో జరగనున్న ఐపిఎల్ 2020 కోసం ఆటగాళ్లంతా యూఏఈకి బయల్దేరి వెళ్లనున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాళ్లు ఆగస్టు 21న యూఏఈ ఫ్లైట్ ఎక్కనున్నట్టు తెలుస్తోంది.