జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి అభ్యర్ధిని ఆదరించి ఆశీర్వదించండి

సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం, వెంకన్నపాలెం నందు మంగళవారం సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు పర్యటించడం జరిగింది. బొబ్బేపల్లి సురేష్ నాయుడు మాట్లాడుతూ శాసనసభ్యుడిగా రెండుసార్లు సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ప్రజలు చేత ఓట్లు వేయించుకొని గెలిచిన కాకాని గోవర్ధన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో, మరో ఐదు సంవత్సరాలు అధికారపక్షంలో ఉండి గడిచిన రెండున్నర సంవత్సరాలుగా మంత్రిగా ఉండి కూడా సర్వేపల్లి నియోజకవర్గానికి చేసిందేమి లేదు. అస్తవ్యస్తంగా రోడ్లు ఉంటే ఎక్కడా కూడా రోడ్ల పైన ఉన్న గుంటలను పూడ్చిన పరిస్థితి లేదు. ఈ సర్వేపల్లి నియోజకవర్గానికి పట్టిన గ్రహణం రాబోయే ఎన్నికల్లో విడిపోనున్నది. రేపు జరగబోయే ఎన్నికలలో జనసేన-బిజెపి-తెలుగుదేశం కలిసి ఉమ్మడి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని సర్వేపల్లి నియోజకవర్గం రేఖలను మార్చి 117 పంచాయతీల్లో కూడా అభివృద్ధి ఎలా ఉంటుందో ప్రజా ప్రభుత్వంలో చేసి చూపిస్తాం. సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక్కక్షణం ఆలోచించి తమ కూటమి తరఫున నిలిచే ఉమ్మడి అభ్యర్థికి ఆదరించి ఆశీర్వదించండి. మీకు మేము ఎప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పి మనస్పూర్తిగా తెలియజేస్తూ వెంకన్నపాలెం గ్రామ ప్రజలందరికీ కూడా ఒకటే మాట ఇస్తున్నాం, రేపు ప్రజా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ గ్రామానికి పూర్తిస్థాయిలో రోడ్డు నిర్మాణం చేసి మీ పంచాయతీలో ఉన్న అనేక సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి ఈరోజు మనస్పూర్తిగా మాటిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి భవాని, శ్రీహరి, స్థానిక మండల ఉపాధ్యక్షుడు కల్తి రెడ్డి శ్రీనివాసులు, విజయ్, శ్రవణ్, అర్జున్, హరికృష్ణ, హరీష్, మేకల కిరణ్, ఆనంద్, మన్రాజ్, కోడూరు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.