బ్రాహ్మణులకు అండగా ఉంటా: బొలిశెట్టి

తాడేపల్లిగూడెం, దేవుడికి భక్తులకి వారిదిగా ఉండే బ్రాహ్మణుల సమస్యలు తీర్చేందుకు నేను అండగా ఉంటానని ఎన్డీఏ కూటమి తాడేపల్లిగూడెం అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. తాడేపల్లిగూడెంలోని జనసేన క్యాంపు కార్యాలయంలో బ్రాహ్మణ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి బొలిశెట్టికి వేద ఆశీర్వచనం అందించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘం నాయకులు తమలో పేద బ్రాహ్మణులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, సంఘానికి నూతన భవనం ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి మాట్లాడుతూ వైసీపీ అధికారంలో వచ్చిన నాటి నుంచి ఆ భగవంతుడికే రక్షణ లేకుండా పోయిందని జగన్ లాంటి రాక్షసుడిని తరిమికొట్టాలని ప్రతి ఒక్కరూ దేవుని వేడుకోవాలన్నారు. ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది ఎన్డీఏ కూటమని అందరికీ తమ ప్రభుత్వం అందగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం గాయత్రి పురోహిత సంఘం ప్రెసిడెంట్ మరల విశ్వనాథం, సెక్రటరీ సూర్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్ శివరామకృష్ణ శర్మ, సంఘ పెద్దలు పాల్గొన్నారు.