Narsipatnam: రైతులను ఆదుకోండి… జనసేన విజ్ఞప్తి

జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రాజన్న వీర సూర్య చంద్ర ఇటీవల కురిసిన అకాల వర్షం వల్ల దెబ్బతిన్నటువంటి పంటపొలాల పరిశీలనకు సోమవారం నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి మాకవరపాలెం, నాతవరం, గొలుగొండ, నర్సీపట్నం మండలంలో ఉన్నటువంటి వరి పంట నష్టపోయిన రైతుల విజ్ఞప్తి మేరకు పరిశీలనకు వెళ్లడం జరిగిందని సూర్య చంద్ర ఈ విధంగా అభిప్రాయపడ్డారు. పంట చేతికి వచ్చిన తర్వాత ఇటీవలే తీవ్ర వాయుగుండం ప్రభావంతో కురిసిన వర్షాల వలన నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని మండలాల్లో కూడా వరి పంట సేద్యం చేస్తున్నటువంటి రైతులు బాగా నష్టపోయారని ఇప్పటికే పెట్టుబడులు ఎక్కువైపోయి చాలా మంది రైతులు వ్యవసాయం చేయకుండా చిన్నచిన్న కంపెనీలలో రోజువారి కూలీలుగా మారిపోయిన తరుణంలో అతి కొద్ది మంది రైతులు మాత్రమే సేద్యం చేస్తున్న కాలంలో రైతు పెట్టుబడి పెట్టడానికి పెట్టుబడి సాయం కోసం బ్యాంకుల చుట్టూ తిరిగిన రుణాలు అందక గవర్నమెంట్ ఇస్తున్నటువంటి రైతు భరోసా 13500 ఏ మూలకి సరిపోక చాలా వరకు రైతులు పొలాలు తనఖా పెట్టి కూలీలుగా మారిన పరిస్థితి, కొంతమంది రైతులు పట్టణాలకు వలస వెళ్లిపోయి పనులు కోసం ఎదురుచూసే పరిస్థితి ఇలాంటి తరుణంలో గ్రామాలలో ఉన్నటువంటి అతి కొద్దిమంది రైతులే సాగు చేస్తున్నటువంటి వరి పంట చేతికొచ్చే సమయంలో ఆకాల వర్షాల వల్ల తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులను పట్టించుకునే నాయకుడే కరువయ్యాడని కనీసం క్షేత్రస్థాయిలో పరిశీలనకు నర్సీపట్నం నియోజకవర్గం స్థానిక శాసనసభ్యులు వారు కానీ వ్యవసాయశాఖ సంబంధించినటువంటి అధికారులు గాని పరిశీలన కూడా రాలేదని రైతులు తమ వద్ద బాధను వెల్లడించారని ఇప్పటికైనా కళ్ళు తెరిచి నర్సీపట్నం నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రంలో పనిచేస్తున్నా వ్యవసాయశాఖ అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన వెళ్లి పంట నష్టం అంచనావేసి నష్టపరిహారం అందే విధంగా ప్రయత్నం చేయాలని లేనిపక్షంలో నష్టపోయిన రైతులు అందరిని ఏకం చేసి జనసేన పార్టీ తరఫున ఆందోళనకు దిగుతామని సూర్య చంద్ర డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు నర్సీపట్నం గ్రామీణ అధ్యక్షుడు ఊది చక్రవర్తి, మాకిరెడ్డి వెంకటరమణ, రాజు పంట నష్టపోయిన రైతులు పాల్గొన్నారు.