జనసేన పార్టీ విశ్వసించే విలువలలో ‘మానవతా సేవ’ ఒక కీలక మూలస్థంభం. ఇదే భావనతో, ఇటీవల మృతిచెందిన సోషల్ మీడియా కార్యకర్త చవ్వాకుల సతీష్ కుటుంబానికి సహాయం అందిస్తూ రామచంద్రపురం రూరల్ జనసేన నేతలు ముందుకొచ్చారు. రామచంద్రపురం రూరల్ మండలం, ఎరుపల్లి గ్రామంలో, స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తల సమక్షంలో, మండల జనసేన అధ్యక్షులు పోతాబత్తుల విజయ్ కుమార్ ₹10,000, జనసేన నాయకులు రాంబాబు నాయుడు ₹5,000 మొత్తం ₹15,000 రూపాయలు చవ్వాకుల సతీష్ కుటుంబానికి అందజేశారు. సతీష్ కి ఇద్దరు చిన్నపిల్లలు ఉండడం, కుటుంబ ఆర్థిక పరిస్థితి దుర్బలంగా ఉండటంతో, ఈ సహాయం అవసరమైందని నేతలు తెలిపారు. ఇందులో భాగంగా, సతీష్ కుటుంబానికి మద్దతుగా ప్రతి జనసైనికుడు, ఎన్.ఆర్.ఐ లు తమ వంతు తోడ్పాటుతో అండగా నిలవాలని పిలుపునిచ్చారు. సమాజానికి సేవలో ప్రతి జనసైనికుడి మద్దతు మాటల్లో కాదు, చర్యల్లో చూపించాల్సిన సమయంలో ఉన్నాము. సతీష్ కుటుంబానికి మనమంతా తోడుగా నిలుద్దాం!
Share this content:
Post Comment