ఎమ్మెల్సీ ప్రచారంలో సురభి వాణీదేవి

హైదరాబాద్‌: రంగారెడ్డి-హైదరాబాద్‌-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్ధి సురభి వాణీదేవి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్క ఒటరును కలుసుకునేలా కార్యక్రమాలు రూపొందించుకుంటున్నారు. ఇందులో భాగంగా పార్టీ సభల్లో పాల్గొంటూనే, వ్యక్తిగతంగా ఓటర్లను కలుస్తున్నారు. ఈ క్రమంలో ఆమె సోమవారం ఉదయం బంజారాహిల్స్‌లోని కేబీఆర్‌ పార్కులో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్‌తో కలిసి ప్రచారం నిర్వహించారు. తనకు మొదటి ప్రాధాన్యతా ఓటువేసి గెలిపించాలన్నారు. పార్కులో మార్నింగ్‌ వాక్‌కు వచ్చిన ప్రముఖ నిర్మాత దిల్‌ రాజును ఓటు వేయాల్సిందిగా కోరారు.