Kothapeta: ఆలమూరు జనసేన రథసారధిగా సూరపరెడ్డి సత్య

కొత్తపేట నియోజకవర్గం, ఆలమూరు మండల జనసేన పార్టీ (అధ్యక్షుడు) రథసారధిగా సూరపరెడ్డి సత్యను ఏకగ్రీవంగా నియమించారు. కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ అధ్యక్షుడు ఆలమూరు మండలంలో జరిగిన పర్యటనలో భాగంగా కార్యకర్తలు, జనసేన మండల మేధావుల అభిప్రాయ సేకరణ అనంతరం వారి అంగీకారంతో సూరపరెడ్డి సత్యను ఏకగ్రీవంగా నియమించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ లళ్యాణ్ ఏర్పాటు చేసిన పార్టీ ఆవిర్భావం నుండి సత్య మండలంతో పాటు కొత్తపేట నియోజకవర్గంలో చురుకైన పాత్ర పోషిస్తూ మండలంలోని కుల, మత, ప్రాంతాలను పక్కన పెట్టి ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ జనసేనాని ఆశయాలకు అనుగుణంగా మండల ప్రజలకు దగ్గర అవ్వటంతో ఆయన సేవలను గుర్తించిన బండారు శ్రీను జనసేన పార్టీ మండల పగ్గాలను సత్యకు అప్పగించారు. ఈ సందర్బంగా సత్య మాట్లాడుతూ అన్ని గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండి వారి కష్ట నష్టాలను పాలు పంచుకుంటూ వారి సమస్యలను తీర్చడంలో ముందంజంలో ఉంటానని అన్నారు. అలాగే తనకు మండల బాధ్యతలు అప్పజెప్పిన శ్రీ బండారు శ్రీనుకి కృతజ్ఞుడై ఉంటానని అన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన సత్యాను జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి, పినపల్ల సర్పంచ్ సంగీత సుభాష్, చెముడులంక ఎంపీటీసీ తమ్మన భాస్కర్రావు, గారపాటి త్రిమూర్తులు, తాళ్ల డేవిడ్, పడాల అమ్మిరాజు, సలాది జయప్రకాశ్ (జెపి), ఎంపీటీసీ పెద్దిరెడ్డి పట్టాభి, కలిదిండి బాలకృష్ణ, సోము పోతురాజు, పళ్ల శ్రీను మరియు పలువురు జనసేన నాయకులు అభినందించారు.