ఘనంగా సువారపు చంద్రశేఖర్ జన్మదిన వేడుకలు

మదనపల్లి రూరల్ మండలం ఉపాధ్యక్షులు సువారపు చంద్రశేఖర్ జన్మదినం సందర్భంగా మదనపల్లి కమ్మవీధిలో జనసేన పార్టీ కార్యాలయంలో గంగారపు రామదాస్ చౌదరి ఆదేశాల మేరకు కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, జిల్లా జాయింట్ సెక్రటరీలు సనా ఉల్లా, గజ్జల రెడ్డెప్ప, రూరల్ మండలం అధ్యక్షులు గ్రానైట్ బాబు, పట్టణ ఉపాధ్యక్షులు పురం నగేష్, రూరల్ మండలం ఉపాధ్యక్షులు కుమార్, నిమ్మనపల్లి సీనియర్ నాయకులు తోట కళ్యాణ్, రూరల్ ప్రధాన కార్యదర్శి పవన్ శంకర, సెక్రటరీ జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.