గీతాంజలి విద్యాసంస్థలు ఛైర్మన్ యస్ వి రమణకి మంగళవారం జనసేన నాయకులు రామ శ్రీనివాస్ మరియు పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానం చేసి హార్థిక శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. గీతాంజలి డిగ్రీ కళాశాలలో జనసైనికుల ఆధ్వర్యంలో ఉమ్మడి కడప జిల్లా ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా గీతాంజలి విద్యాసంస్థల అధినేత ఎస్వీ రమణని ఘనంగా సన్మానించడం జరిగినది. ఈ సందర్భంగా రాజంపేట అసెంబ్లీ మరియు పార్లమెంట్ నియోజకవర్గం జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ గీతాంజలి విద్యాసంస్థలు ఛైర్మన్ యస్ వి రమణ ద్వారా రాజంపేట పరిసర ప్రాంతాలలో సామాన్య మధ్యతరగతి విద్యార్థినీవిద్యార్థుల వారికి కూడా ఉన్నత స్థాయి విద్య అందించాలని ఆయన ఎప్పుడూ పరితపిస్తుంటారంటూ విద్యా సంస్థలతో పాటుగా రాజకీయాలలో కూడా ఉన్నత స్థాయి పదవులు అధిరోహించాలంటూ అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు అబ్బీగారి గోపాల్, రాయచోటి యువ నాయకులు బుల్లెట్ విజయ్, యస్వంత్ రెడ్డి, వెంకటేష్, మురళి నాయకులు యోగేశ్వర్ రెడ్డి అజ్మత్ బాషా తదితర జనసైనికులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment