తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం ఐ.పంగిడిలో శనివారం ప్లాస్టిక్ నిర్మూలన కోసం కూటమి ప్రభుత్వం తరుపున వినూత్న ప్రయత్నం జరిగింది. శనివారం ఉదయం 11 గంటలకు పంచాయతీ కార్యదర్శి, సచివాలయం సిబ్బంది, ఉపాధ్యాయులు, సర్పంచ్, గ్రామస్థులు, ఎస్ ఎమ్ సి వైస్ చైర్మన్, జనసేన నాయకులు పెరుగు శివ, సభ్యులు మడిచర్ల నాగరాజు, విద్యార్థులు, విద్యార్దినులతో కలిసి ఊరంతా ప్లాస్టిక్ నిర్మూలన చేయాలని నినాదాలు చేస్తూ ర్యాలీగా వెళ్ళారు. ఐ.పంగిడి సెంటర్లో విద్యార్థులతో మానవహారం ఏర్పాటు చేసి అందరినీ ప్లాస్టిక్ నిర్మూలన చేయాలని పంచాయతీ కార్యదర్శి ముత్యం ప్రతిజ్ఞ చేయించారు. తదుపరి స్కూల్ వైస్ చైర్మన్ పెరుగు శివ మాట్లాడుతూ మన కూటమి ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్చాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని, ప్రతినెల 3వ శనివారం మనందరి పిల్లలతో ఈ విధమైన కార్యక్రమాలు చేస్తే కొంతైనా మార్పు వస్తుందని, అలాగే వ్యాపారస్తులు, గ్రామస్థులు ఈరోజు నుంచి గ్రామంలో ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించాలని కోరారు. మన వంతుగా మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్చాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని, రాష్ట్రాన్ని ప్రగతిమార్గంలో నడవడానికి మన వంతు కృషి చేయాలని కోరారు.
Share this content:
Post Comment