నేటి యువతకు స్వామి వివేకనంద భావాలు ఆచరణనీయం

  • సాయిప్రియసేవాసమితి చైర్మన్ జ్యోతుల గంగాభవానీ శ్రీనివాసు

పిఠాపురం నియోజవర్గం: స్వామి వివేకానంద జన్మదినోత్సవం మరియు జాతీయ యువజన ఉత్సవాలు సందర్భంగా పిఠాపురం నియోజవర్గం సాయిప్రియ సేవాసమితి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జన్మదినోత్సవం మరియు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా జరిపిన వారోత్సవాల ముగింపు కార్యక్రమం శుక్రవారం పిఠాపురం నియోజవర్గం, గొల్లప్రోలుమండలం, దుర్గాడ గ్రామ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గాడ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ కందా శ్రీనివాస్ అధ్యక్షతన, సాయిప్రియ సేవసమితి చైర్మన్ జ్యోతుల గంగా భవానీ శ్రీనివాసు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాల నందు సాయిప్రియ సేవాసమితి వ్యవస్థాపక అధ్యక్షులు జ్యోతుల శ్రీనివాసు సొంత నిధులతో ఏర్పాటు చేసిన స్వామి వివేకానంద విగ్రహానికి ముందుగా దుర్గాడ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ కందా శ్రీనివాస్, సాయిప్రియ సేవాసమితి చైర్మన్ జ్యోతుల గంగా భవానీ శ్రీనివాసు పూలమాలలు వేసి స్వామి వివేకానందకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సాయిప్రియ సేవాసమితి చైర్మన్ జ్యోతుల గంగాభవానీశ్రీనివాసు మాట్లాడుతూ నేటి భారతదేశం సమాజంలో స్వామివివేకానంద ఆదర్శభావాలు అందరు ఆచరించి ఆదర్శమైన జీవితం ను అలవర్చుకోవాలని, ప్రతి యువతి, యువకులు ప్రస్తుతం సమాజానికి ఆదర్శంగా ఉంటూ ఉన్నతస్థాయికి ఎదగాలని, స్వామివివేకానందను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ మేల్కొని మనం జన్మించిన స్వగ్రామానికి, మన భారతదేశానికి ఉత్తమసేవలు అందించాలని యువకులను ఉద్దేశించి మాట్లాడారు. అందుకే సాయిప్రియ సేవాసమితి ఆధ్వర్యంలో గొల్లప్రోలు మండలం నందు గల జిల్లాపరిషత్ ఉన్నతపాఠశాలల నందు వకృత్త్వ, వ్యాసరచన వంటి పోటీలు నిర్వహించి యువకులను ప్రోత్సహించడం జరిగిందని, ఈ వారోత్సవాల్లో భాగంగా పేదవారైయిన వృద్ధులకు దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని కావున ప్రతిఒక్కరూ,ప్రతి సంవత్సరం స్వామివివేకానంద జన్మదినోత్సవాన్ని ప్రతి గ్రామమునందు ఘనంగా నిర్వహించాలని ఈ సందర్భంగా అక్కడకు విచ్చేసిన యువకులను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం గ్రామ పెద్దలైన దంగేటి నాగేశ్వరరావు, సాధనాల చంటిరాము, రావుల తాతారావు, పేకేటి వీరమణి, గౌతు పద్మ, సాయిప్రియ సేవాసమితి కార్యదర్శి మేకల కృష్ణ తదితరులు పూలమాలలు వేసి స్వామి వివేకానందకు నివాళులర్పించారు. అనంతరం స్వీట్ లు పంపిణీ కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో జ్యోతుల పెదశివ, యింటి వీరబాబు, శాఖ సురేష్, కొప్పలచక్రదర్, ఆదినారాయణ, రాయుడు వీరబాబు, మంతిన గణేష్, చేశెట్టి భద్రం, కీర్తి చిన్నా, నాగబోయిన వీరబాబు, విప్పర్తి కృపాకర్ తదితరులు పాల్గొన్నారు.